ఇచ్చంపల్లి పై కేంద్ర నిర్ణయం అభినందనీయం : మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు

ఇచ్చంపల్లి పై కేంద్ర నిర్ణయం అభినందనీయం : మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు

హైదరాబాద్, వెలుగు: ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయడం పట్ల మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల తరపున కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు సాకారం కావడానికి 1999లో ఇచ్చింపల్లి నుంచి హైదరాబాద్ వరకు ఉద్యమ కారులతో ' గోదావరి పాదయాత్ర' చేసినట్లు గుర్తు చేశారు. నాటి ఉమ్మడి ఏపీ సీఎం పీవీ నరసింహరావు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, గోదావరి జలాలలో రాష్ట్ర వాటాను పూర్తిగా ఉపయోగించుకొని, సస్యశ్యామలం చేయడానికి ఇచ్చంపల్లి నిర్మాణం శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు.